అదిరిపోయిన దమ్ మసాలా సాంగ్.. తమన్ కుమ్మేసాడు

అదిరిపోయిన దమ్ మసాలా సాంగ్.. తమన్ కుమ్మేసాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు..నేటితో ఆకలి తీరిపోయింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఎదురొచ్చే గాలి..ఎగరేస్తోన్న చొక్కాపై గుండీ..ఎగబడి ముందడికే..వెళ్లిపోతాది నేన్నిక్కిన బండి..దమ్ మసాలా..అంటూ సాగే ఈ పాటకు తమన్ (Thaman S) అందించిన మ్యూజిక్..ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మహేష్ మాస్ స్వాగ్ తో..నోరూరించే మిర్చి మసాలలా ఉన్న ఈ పాటకు 'సరస్వతీ పుత్ర' రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) లిరిక్స్ అందించారు. సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ పాడారు. 

చాలా కాలం తరువాత మహేష్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోలు, పోస్టర్స్ కూడా ఉండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఈ రిలీజైన ఫస్ట్ సింగిల్ తో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ALSO READ : ఆ వీడియో నాదే కానీ.. నా ప్రమేయం లేదు: జార పటేల్

హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి కానుక‌గా 12 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది.