ఆ వీడియో నాదే కానీ.. నా ప్రమేయం లేదు: జార పటేల్

ఆ వీడియో నాదే కానీ.. నా ప్రమేయం లేదు: జార పటేల్

రెండు రోజులనుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా(Rashmika mandanna) డీప్ ఫేక్ వీడియో గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ జరా పటేల్() డీప్ నేక్ తో ఉన్న వీడియోకు రష్మిక ఫోటోను జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆకతాయిలు. ఆ వీడియో కాస్త అసభ్యకరంగా ఉందటంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. తరువాత అది ఫేక్ అని తెల్సుకున్నారు.

ఈ విషయంపై ఇండియాస్ టాప్ సెలబ్రెటీస్ అందరు ఫైర్ అయ్యారు. వీడియో మార్పింగ్ చేయడం దారుణమని, చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఇదే విషయంపై ఆ వీడియోలో ఉన్న అసలు వ్యక్తి జరా పటేల్ ఇంస్టాగ్రాం వేదికగా స్పందించారు. నా శరీరానికి రష్మిక ఫోటో పెట్టిన మార్పింగ్ వీడియో చూసి షాకయ్యాను. మార్పింగ్ లో నా ప్రమేయంలేదు. భవిష్యత్తులో మహిళలు, ఆడపిల్లల భద్రత గురించి తలుచుకుంటేనే భయమేస్తోంది. మహిళలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.. అంటూ రాసుకొచ్చింది జరా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ALSO READ : ఇండస్ట్రీలో ఉండాలంటే ఆపని చేయాల్సిందే.. అనన్య షాకింగ్ కామెంట్స్