మహేష్ మాస్ ఫీస్ట్.. అదిరిపోయిన దమ్ మసాలా సాంగ్ ప్రోమో

మహేష్ మాస్ ఫీస్ట్.. అదిరిపోయిన దమ్ మసాలా సాంగ్ ప్రోమో

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత మహేష్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోలు, పోస్టర్స్ ఉండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.

Also Read :- టాప్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ

సంక్రాతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. దమ్ మసాలా అంటూ సాగే ఈ పాటకు తమన్ అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ప్రోమోలో మహేష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక పూర్తి సాంగ్ ను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ సరనస శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.