Guntur Kaaram: మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు..

Guntur Kaaram: మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు..

మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజైన ట్రైలర్, టీజర్,సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్లో ఉంది.

ఇక నిన్న గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ ఈ వెంట్ లో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మాస్ సాంగ్స్ తో లైవ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి మావా ఎంతైనా సాంగ్(Mawaa Enthaina)  రిలీజ్ చేశారు."మావా ఎంతైనా పర్లేదు బిల్లు..మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు..గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు.. చెప్పుకోలేని బాధే డబల్లు.. మారిపోయే లోకం.. చెడ్డోళ్లంతా ఏకం.. నాజుక్కు అయినా నాబోటోడికి దినదినమోక నరకం..యాడో లేదు లోపం..నామీదే నాకు కోపం..అందనన్నా ఆకాశానికి ఎంతకని ఎగబడతాము" అంటూ సాగే హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. శ్రీ కృష్ణ, రామాచారి ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హార్ట్ బ్రేకింగ్ సాంగ్ అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ పాటలో మహేశ్ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.