రమణగాడి మాస్ జాతరకి బాక్సాఫీస్ షేక్.. ఏడురోజుల్లో రికార్డ్ కలెక్షన్స్

రమణగాడి మాస్ జాతరకి బాక్సాఫీస్ షేక్.. ఏడురోజుల్లో రికార్డ్ కలెక్షన్స్

మహేష్ బాబు(Mahesh Babu)ని సూపర్ స్టార్, క్రౌడ్ పుల్లర్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతోంది. మాములుగా బాబు సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడం కామన్. కానీ, ప్రేక్షకుల నుండి నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమా, అది కూడా ఆప్షన్ లో మూడు సినిమాలు ఉండగా ఈ మాస్ రాంపేజ్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కేవలం మహేష్ బాబుకి మాత్రమే సాధ్యం. 

ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్సాఫిస్ దగ్గర వసూళ్ల వరద పారిస్తోంది ఈ మూవీ. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఆరు రోజుల్లోనే రూ.212 కోట్ల గ్రాస్ రాబట్టిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. అందులో రూ.100 కోట్లకి పైగా షేర్ రావడం గమనార్హం.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయి. ఒక రీజనల్ మూవీ అది కూడా నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. అది కేవలం మహేష్ బాబు స్టామినా వల్లే సాధ్యమైంది అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటికే 85-90% రికవరీ చేసిన గుంటూరు కారం.. మరో రూ.20 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఊపును చూస్తే.. మరో రెండు రోజుల్లో బ్రేకీవెన్ సాధించి బ్లాక్ బస్టర్ లిస్టులో చేరనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నుండి సెకండ్ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి.. గుంటూరు కారం సినిమాకు సూపర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏమేరకు అద్భుతాలు చేయనుందో చూడాలి.