
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా గుంటూరు కారం (GunturKaaram) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్..మహేష్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా రిలీజ్కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో..మహేష్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి రమణ గాడి మాస్ జాతర చూడటానికి రెడీ అయిపోండి అంటూ..అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇవాళ సాయంత్రం నుంచే ఈ బుకింగ్స్ మొదలవ్వనున్నాయి. అందుకు క్రింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి బుక్ చేసుకోండి అంటూ మేకర్స్ తెలిపారు.
లింక్ ఓపెన్ చేసి బుక్ చేసుకోండి: https://linktr.ee/GunturKaaramTickets
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
రమణ గాడి MASS జాతర చూడటానికి Ready అయిపోండి! ?? #GunturKaaram Advance Bookings are OPEN Now! ??
— Haarika & Hassine Creations (@haarikahassine) January 10, 2024
Grab your tickets now ?️ - https://t.co/78PLl3VD9o
Super ? @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash… pic.twitter.com/MFrzc7c7z5