
ఈ సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం’(GunturKaaram) ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఘాటైన మాస్ మసాలా సినిమా అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
లేటెస్ట్గా బుర్రిపాలెం బుల్లోడు గుంటూరు కారం రిలీజ్కు ముందే ఆల్ టైం రికార్డ్ నెలకొల్పిందని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (Prasads Multiplex) ట్వీట్ చేసింది. ఏకంగా 41 షోలతో గుంటూరు కారం రికార్డ్ కాదు..ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తోందంటూ మహేష్ బాబు డైలాగ్తో ట్వీట్ చేసింది. కాగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఓ సినిమాకు 41 షోలతో ఆడించడం ఇదే ఫస్ట్ టైం అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో 6 స్క్రీన్స్ ఉండగా.. జనవరి12వ తేదీన అన్ని స్క్రీన్లల్లో కూడా రోజంతా గుంటూరు కారం సినిమానే ప్రదర్శిస్తారు.
రీసెంట్ ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ రోజు 37 షోలు పడి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ గుంటూరు కారం కొట్టేసింది. .
ఇదిలా ఉంటే..USA ప్రీమియర్ షోలు ఒక రోజు ముందుగానే (జనవరి 11న) పడనున్నాయి. అక్కడ మొత్తం 5,408 కు పైగా ప్రీమియర్ షోస్ పడనున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మూవీస్ చూసుకుంటే..యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా రాజమౌళి RRR (5408 షోలు) గతంలో రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు దీన్ని మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీతో సమం చేసింది.
Burripalem Bullodu has already kicked off the game even before the release! ?? #GunturKaaram is taking over #PrasadsMultiplex with an unprecedented 41 shows on Day 1 ??
— Prasads Multiplex (@PrasadsCinemas) January 10, 2024
This is just not a Track Record...this is an ??? ???? ?????? ❤️?
Book your tickets now… pic.twitter.com/hGpzp6cVdY
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.