
ఈ సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’(GunturKaaram) ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా రిలీజైన స్పైసీ మాస్ కుర్చీ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది.
ప్రస్తుతం ఈ ఘాటైన మాస్ మసాలా సినిమా అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్గా సూపర్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా జనవరి 12 న రిలీజ్ అవుతుండటంతో..USA ప్రీమియర్ షోలు ఒక రోజు ముందుగానే (జనవరి 11న) పడనున్నాయి. అక్కడ మొత్తం 5,408 కు పైగా ప్రీమియర్ షోస్ పడనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మూవీస్ చూసుకుంటే..యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా రాజమౌళి RRR (5408 షోలు) గతంలో రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు దీన్ని మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీతో సమం చేసింది. ఈ లెక్కన ప్రీమియర్ షోస్ పడటంతో..ఇది ఆల్ టైం రికార్డ్ అని సినిమా అంటూ ప్రకటించింది మూవీ టీమ్.
ఈ న్యూస్ వినగానే సూపర్ ఫ్యాన్స్ కు..చూడగానే మజా వస్తుంది..హార్ట్ బీట్ పెరుగుతుంది..ఈల వేయాలి అనిపిస్తుంది కదూ .. అంతే ఉంటుంది మరి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
When you aim to celebrate a big man, you equally need something gigantic ?
— Guntur Kaaram (@GunturKaaram) January 5, 2024
And our Super? @urstrulyMahesh has already begun his hunt in an ALL-TIME RECORD WAY ???
RECORD PREMIERES LOCATIONS AND SHOWS in the USA for #GunturKaaram ?@PrathyangiraUS… pic.twitter.com/IIgyfidbyA