రియల్ సూపర్ స్టార్ : ఇరాక్ అభిమానికి మహేష్ సహాయం

రియల్  సూపర్ స్టార్  :  ఇరాక్ అభిమానికి మహేష్ సహాయం

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నాడు. గుండె సమస్యతో బాధపడుతున్న తన అభిమాని కుమారుడికి ఆర్ధిక సహాయం అందించాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆ ఆభిమాని మన ఇండియా కూడా కాదు ఇరాక్ దేశస్థుడు.అతని పేరు హుసామ్ తాలిబ్ హమాజ్. అతను ప్రస్తుతం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఆయన కుమారుడు రాకన్ హుసామ్ తాలిబ్. 

గతకొంతకాలంగా అతను  సిండ్రోమ్, అట్రియోవెంట్రిక్యులర్ సెప్టల్, లెఫ్ట్  ఆట్రియోవెంట్రిక్యులర్ వాల్వ్ రెగర్జిటేషన్‌తో బాధపడుతున్నాడు. వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేయాలని, దానికి చాలా డబ్బు అవసరమవుతాయని వైద్యులు సూచించారు. దీంతో ఎం చేయాలో తలియని హుసామ్.. వెంటనే మహేష్ బాబు ఫౌండేషన్‌ను సంప్రదించాడు. పిల్లాడి పరిస్థితిని తెలుసుకున్న మహేష్ బాబు ఫౌండేషన్‌ టీమ్.. వెంటనే రకన్‌ ను ఆంధ్రా హాస్పిటల్‌ కు తరలించారు. 

మే 10న  అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కొన్ని రోజులపాటు ఐసీయూలో ఉన్న రకన్‌ ఆరోగ్యం ఇప్పుడు కాస్త కుదుటపడుతుండటంతో.. మరికొన్ని రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పుకొచ్చారు. దీంతో.. ఆ అభిమాని మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియచేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.