
కరోనా కారణంగా.. దాదాపు రెండేళ్లకుపైగా ఇంటికే పరిమితమైన స్టార్లు.. ఇప్పుడు బయటి దేశాలకు టూర్లు వేస్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి.. తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ అండ్ యూరప్ దేశాలకు టూర్ వేసిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఇదే చిరు మొదటి హాలిడే ట్రిప్. అలాగే ‘పుష్ఫ’ సూపర్ హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ కు వెళ్లొచ్చారు. తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కూడా...వెకేషన్ కు ముహుర్తం ఫిక్స్ చేసాడు.
మహేష్ బాబు కూడా..మొన్న ఫ్యామిలీతో టూర్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వెకేషన్ కు ముహుర్తం ఫిక్స్ చేసాడు సూపర్ స్టార్. కొంత గ్యాప్ తర్వాత.. మహేష్ బాబు..సర్కారు వారి పాట సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. తొలుత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు దగ్గర ఈ మూవీ మంచి వసూళ్లే రాబట్టింది. రెండు వందల కోట్లకు దగ్గరగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లు వస్తుండడంతో తొందర్లో.. ఈ మార్క్ ను రీచ్ అయ్యే అవకాశం ఉంది.
మహేష్ బాబు కెరీర్ లో బిగ్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ మీట్ కూడా రీసెంట్ గా నిర్వహించారు. నెక్స్ట్ మూవీ షూటింగ్ మొదలయ్యేలోపు వెకేషన్ కు వెళ్లొచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు, తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ బాబు మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూట్ తో బిజీగా అవుతారు కాబట్టి ఈలోపే ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో కలసి జర్మనీకి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రశంసలు
డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్
12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు