జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన మహేష్ బాబు, నమ్రత

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన మహేష్ బాబు, నమ్రత

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఓటు వేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేష్ బాబు, నమ్రతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  యంగ్ హీరో రోషన్ కూడా ఓటు వేశారు.

కాగా, తెలంగాణలో 17  లోక్​సభ స్థానాలకు  పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు  తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మల్కాజిగిరిల 37.69%, భువనగిరిలో 62.05శాతం, మహబూబ్ బాద్ లో 61.04 శాతం పోలింగ్ నమోదైంది.  ఇక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది.