రాజమౌళి సినిమా కోసం మహేష్ సిద్ధం.. వైరల్ అవుతున్న కొత్త లుక్

రాజమౌళి సినిమా కోసం మహేష్ సిద్ధం.. వైరల్ అవుతున్న కొత్త లుక్

ప్రస్తుతం ఇండియన్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సెంబు SSMB29 అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు సంబందించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

ఇక ఆడియన్స్ కూడా ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది? ఏ బ్యాక్డ్రాప్ లో సినిమా ఉంటుంది? మహేష్ ఏ లుక్ లో కనిపిస్తారు? అనే విషయాలను తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మహేష్ ఫారన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ట్రిప్ రాజమౌళి సినిమా కోసమే ననే వార్తలు వినిపించాయి. అయితే ఫారెన్ ట్రిప్ ముగించుకొని ఇండియా వచ్చిన తరువాత మహేష్ కు సంబందించిన లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ లుక్ కు సంబందించిన ఫోటో ఒకటి ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. లాంగ్ హెయిర్ తో, సన్నని గడ్డం, మీసంతో ఉన్న మహేష్ లుక్ అదిరిపోయింది. దాదాపు ఇదే లుక్ లోనే సినిమాలో కనిపిస్తారట మహేష్. 

ఈ లుక్ చూసిన మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కొత్త లుక్ లో మహేష్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాడని, హాలీవుడ్ హీరోలను సైతం పక్కకు నెట్టేసేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్తుందని, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి భారీ అంచనాల మంధ్య మొదలవుతున్న ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనాలు క్రియేట్ అవుతుందా అనేది చూడాలి.