SSRMB: మహేష్ మాస్ లుక్ వైరల్.. రాజమౌళి సార్ ఇదే కావాలి!

SSRMB: మహేష్ మాస్ లుక్ వైరల్.. రాజమౌళి సార్ ఇదే కావాలి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు(Mahesh Babu). అందుకే ఆయన్ని ప్రేమగా మిల్కీ బాయ్ అని పిలుచుకుంటారు. ఇక ఆయనకున్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వాల్సిందే.. సరికొత్త రికార్డ్స్ సెట్ అవ్వాల్సిందే. ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రిపేర్ అవుతున్నారు. 

ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ ఐదు గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందు కోసం ప్రస్తుతం మహేష్ టెస్ట్ లుక్ జరుగుతోంది. ఈ లుక్స్ కోసం ఫేమస్ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ ను హైర్ చేసుకున్నారట మేకర్స్.

అయితే తాజాగా మహేష్ బాబుకి సంబంధించిన ఒక మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంగ్ హెయిర్ తో గాగుల్స్ పెట్టుకొని ఉన్న ఈ లుక్ అదిరిపోయింది. ఆ లుక్ చూసిన మహేష్ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాజమౌళి గారు మీ సినిమాలో కూడా మహేష్ ఇలాంటి మాస్ అండ్ స్టైలీష్ లుక్ లో ఉండేలా చూడండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న లుక్ మహేష్ నటించిన లేటెస్ట్ యాడ్ కి సంబంధించిందని తెలుస్తోంది. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది.