
‘దసరా’ లాంటి మాస్ సినిమా తర్వాత ‘హాయ్ నాన్న’ అనే ఎమోషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ నుంచి ‘గాజు బొమ్మ’ అనే పాటను విడుదల చేశారు.
మహేష్ బాబు ఈ పాటను సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. టైటిల్‌తోనే ఇదొక ఫాదర్ సెంటిమెంట్ సినిమా అనే ఫీల్ కలిగించిన మేకర్స్.. ఈ పాటతో తండ్రి, కూతురు మధ్య అనుబంధాన్ని అందంగా చూపించారు. ‘ఇటు రావే నా గాజుబొమ్మా.. నేనే నాన్న, అమ్మా.. యద నీకు ఉయ్యాల కొమ్మా.. నిన్ను ఊపే చెయ్యే ప్రేమ.. వాలిపో ఈ గుండెపై.. ఆడుకో ఈ గూటిలోనే..’ అంటూ చిన్నారికి జోల పాడుతున్నట్టుగా లిరిక్స్ రాశారు అనంత శ్రీరామ్.
హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తనే పాడాడు. తండ్రి, కూతురుగా నాని, బేబి కియారా ఖన్నాల విజువల్స్ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 21న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.