Gautham Ghattamaneni: మహేష్ వారసుడి మొదటి స్టేజి పర్ఫార్మెన్స్.. తల్లి నమ్రత ఎమోషనల్ పోస్ట్

Gautham Ghattamaneni: మహేష్ వారసుడి మొదటి స్టేజి పర్ఫార్మెన్స్.. తల్లి నమ్రత ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారసుడు గౌతమ్ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్దమయ్యిందా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా గౌతమ్ స్టేజీ ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడట. ఈ నేపధ్యంలో తల్లి నమ్రత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా చూసి మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మహేష్ బాబు ఫ్యామిలీ ఈమధ్య వెకేషన్ కోసం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ నాటకంలో భాగంగా స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడట గౌతమ్. ఇదే విషయాన్ని తల్లి నమ్రత నెటిజన్స్ తో పంచుకున్నారు. కొడుకు గౌతమ్ విషయంలో చాలా గర్వపడుతున్నాను.. అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు.. ఈమధ్య గౌతమ్ వర్కౌట్స్ కూడా మొదలుపెట్టాడు. బాడీ బిల్డ్ చేస్తున్న ఇమేజెస్ కూడా సోషల్ మీడియాలో ఉరల్ అయ్యాయి. ఇప్పటికే గౌతమ్ తండ్రి మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన విషయం కూడా తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే.. మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ కి ఇప్పుడు 17 ఏళ్ళు. అంటే.. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో హీరోగా లంచ్ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.