మరో కొత్త బిజినెస్ చేయనున్న మహేశ్ బాబు

మరో కొత్త బిజినెస్ చేయనున్న మహేశ్ బాబు

సినిమాల్లో బిజీగా ఉంటూనే బిజినెస్ రంగంలోనూ దూస్కెళ్తున్నాడు సినీ నటుడు మహేశ్ బాబు. ఇటీవల ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టి మహేశ్… తాజాగా మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. తమ దుస్తులను http://www.spoyl.in/mahesh-babu లో ఆవిష్కరిస్తామని మహేశ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని మహేశ్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. మరో మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ వెబ్ సైటలోకి లాగిన్ కావడం ద్వారా ప్రిన్స్ మహేశ్ బాబును అభిమానులు కలుసుకోవచ్చని తెలుస్తోంది.