
‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa The Lion King) వస్తోంది. డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ముఫాసాకు తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా తిరిగి వస్తున్నారు. మరియు అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అడవి యొక్క అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది. ఇక మహేష్ బాబు గొంతుతో ఆ పవర్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవ్వండి.
‘ముఫాసా: ది లయన్ కింగ్ లో భాగమవ్వడం పట్ల మహేష్ బాబు మాట్లాడుతూ “డిస్నీ యొక్క బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు టైమ్‌లెస్ స్టోరీ టెల్లింగ్‌ని నేను తరుచూ మెచ్చుకుంటాను, ముఫాసా పాత్రకు నా వాయిస్ ఇవ్వడం చాలా హ్యాపీ. ఎప్పటికైనా ఇది నా పిల్లలతో నేను ఎంతో థ్రిల్ అవుతూ ఎంజాయ్ చేసే ఫీలింగ్. డిసెంబర్ 20న తెలుగులో సిల్వర్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు ఎప్పుడు చూస్తారోనని ఎదురు చూస్తున్నాను” అని అన్నారు. మరి ఎలాంటి కొత్త అనుభూతి కలుగునుందో తెలియాలంటే ట్రైలర్ చూడాల్సిందే.
తమకు నచ్చిన భాషలో సినిమా అనుభవాన్ని ఆస్వాదించడం మా లక్ష్యం. ముఫాసా యొక్క ఐకానిక్ క్యారెక్టర్ రానున్న తరాలకు ఒకవిధంగా ఎంతో స్ఫూర్తినిచ్చింది మరియు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్‌కి తన గొంతుతో జీవం పోయడం మాకు చాలా హ్యాపీగా ఉందని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు. గతంలో ‘ది లయన్ కింగ్’కు తెలుగులో నాని డబ్బింగ్ చెప్పాడు.
SuperStar @urstrulyMahesh is the Telugu Voice of #Mufasa for Disney's much awaited visually stunning family entertainer MUFASA: THE LION KING ?
— Viswa CM (@ViswaCM1) August 21, 2024
Telugu Trailer to launch on 26th August at 11.07am ❤️?#MufasaTheLionKing roars in theatres on 20th Dec in English, Hindi, Tamil &… pic.twitter.com/Vp7FC5MAFN
అయితే ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హిందీ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పారు. అలాగే ముఫాసా కొడుకు సింబా పాత్రకు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, చిన్న కొడుకు అబ్రమ్ ఖాన్ ముఫాసా చిన్నప్పటి పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.