
ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇవాళ ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన రామ నామస్మరణలతో మారు దేశమంతా మారు మోగిపోతుంది. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్పందించారు. 'చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని..తన ట్వీట్లో తెలిపాడు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో దూసుకెళ్తోంది.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న మహేష్..త్వరలో రాజమౌళి దర్శకత్వం లో ఓ సినిమా చెయ్యనున్నారు. మార్చి లేదా ఏప్రిల్ లో జక్కన్న ప్రాజెక్ట్ లో మహేష్ జాయిన్ అవుతున్నట్లు సమాచారం.
Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam ?
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024