
2023 ఆగస్ట్ 17న మహేష్ బాబు ఇంట్లో..గత ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నపెట్ డాగ్(ప్లూటో) చనిపోయిందని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సితార ఎప్పుడు ప్లూటోతో ఎంతో చక్కగా ఆడుకుంటుందని..ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న ప్లూటో మృతి చెందడంతో నమ్రత శిరోద్కర్, కూతురు సితార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు.ఈ చనిపోయిన ప్లూటో డాగ్ కి సితార(Sitara)కి మధ్య ఎంతో స్పెషల్ బాండింగ్ ఉందని మహేష్ బాబు సైతం పోస్ట్ చేసి ఎమోషన్ అయ్యారు.
నిన్న ఆదివారం రోజున (అక్టోబర్ 22న) ఉన్నట్టుండి ప్లూటో లాంటి మరో పప్పీతో.. మహేష్ కనిపించడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం మహేష్ ఓ పప్పీని చేతుల్లోకి తీసుకుని..హుషారైన నవ్వులు చిందిస్తున్న ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇపుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. ప్లూటో వారసుడు వచ్చాడు..అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగా ఈ డాగ్ ప్లూటో వారసుడా? కాదా? అన్నది మహేష్ ఫ్యామిలీ ప్రకటిస్తే క్లారీటీ వస్తోంది.
Also Read :- రష్మిక మందన్న హీరోయిన్‌గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ
మహేశ్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో 'గుంటూరు కారం(Gunturu kaaram)' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెర వేగంగా జరుగుతోంది. గుంటూరు కారం సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీలో మహేష్ బాబు నటించబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.