SSRajamouli: మహేష్ బాబు 'వారణాసి'కి 1300 కోట్ల బడ్జెట్ నిజమేనా? మౌనం వీడిన ప్రియాంక చోప్రా!

SSRajamouli: మహేష్ బాబు 'వారణాసి'కి 1300 కోట్ల బడ్జెట్ నిజమేనా? మౌనం వీడిన ప్రియాంక చోప్రా!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' .  ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అయితే లేటెస్ట్ గాఈ సినిమా బడ్జెట్ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్టుపై చేసిన కామెంట్లు  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి

'వారణాసి' బడ్జెట్ రూ.1300 కోట్లా !

ముఖ్యంగా సినీవర్గాలో  'వారణాసి' మూవీ కథ కంటే కూడా దాని బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను సుమారు 1300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది రాజమౌళి కెరీర్‌లోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రం కాబోతోందని సమాచారం. లేటెస్ట్ గా 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో' (సీజన్ 4) మొదటి ఎపిసోడ్‌లో అతిథిగా పాల్గొన్న ప్రియాంక చోప్రా పాల్గొంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీకి ఈ మూవీ బడ్జెట్ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

ఈ ఎపిసోడ్‌లో కపిల్ శర్మ తనదైన శైలిలో చమత్కరిస్తూ.. ప్రియాంక ఏది చేసినా లార్జర్ దాన్ లైఫ్ ఉంటుంది. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తారు, ఇప్పుడు మీరు కూడా తోడయ్యారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 1300 కోట్లు అని విన్నాం. అంటే అంత డబ్బుతో సినిమా తీస్తున్నారా లేక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారా? అని ప్రశ్నించారు.

ప్రియాంక పంచ్ డైలాగ్

కపిల్ ప్రశ్నకు ప్రియాంక చోప్రా నవ్వుతూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అంటే మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఆ బడ్జెట్‌లో సగం నా బ్యాంక్ అకౌంట్‌కే వెళ్ళిందని అంటున్నారా? అని అడిగారు. దానికి కపిల్ "అవును, నిజమే కదా" అని అనగా.. "నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు అంటూ సరదాగా క్లారిటీ ఇచ్చారు. సినిమా బడ్జెట్ పెరగడానికి తనే కారణమని వస్తున్న వార్తలను ఆమె చాలా హుందాగా, హాస్యంతో కొట్టిపారేశారు.  ఈ సినిమాలో ప్రియాంక చోప్రా 'మందాకిని' (Mandakini) అనే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. పసుపు రంగు చీర కట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని కొండ అంచున ఉన్న ఆమె లుక్ చూస్తుంటే.. ఈమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, కథను మలుపు తిప్పే ఒక బలమైన 'యాక్షన్' పాత్ర అని అర్థమవుతోంది.

 

 'వారణాసి'లో ఏం ఉండబోతోంది?

 ఈ 'వారణాసి'  సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్. మహేష్ బాబు ఈ సినిమాలో రాముడి ఛాయలున్న రుద్రుడిగా కనిపించబోతున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా రాకతో ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు. బాహుబలి, RRR చిత్రాలతో 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన జక్కన్న.. ఈసారి 'వారణాసి'తో 2000 కోట్ల మార్కును అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు ఇప్పటికే ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు.  మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ మహేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. 'వారణాసి' అనే టైటిల్ లోతుగా ఆలోచిస్తే.. ఇందులో ఆధ్యాత్మికత , ఆధునిక అడ్వెంచర్ మిళితమై ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, 1300 కోట్ల బడ్జెట్ అంటే సామాన్యమైన విషయం కాదు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!