బ్యాడ్మింటన్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో లవ్ ఆల్

బ్యాడ్మింటన్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో లవ్ ఆల్

మహేష్ భట్, ఆనంద్ పండిట్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ సమర్పణలో కె.కె.మీనన్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో సుధాంశు శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ మూవీ ‘లవ్ ఆల్’. ఎం.రమేష్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రం తెలుగుతో పాటు ఆరు భారతీయ భాషలలో ఆగస్టు 25న విడుదల కానుంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ‘సినిమా చూశాను. చాలా బాగుంది. బ్యాడ్మింటన్ గురించే కాదు మొత్తం స్పోర్ట్స్ గురించి చర్చించే చిత్రం. 

పేరెంట్స్‌‌‌‌‌‌‌‌లో క్రీడలను కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది. కొందరు తమ స్పోర్ట్స్ కలని మధ్యలోనే వదిలేస్తారు. వాళ్లంతా ఈ సినిమా చూశాక.. ఇది మన డ్రీమే కదా అనుకుంటారు. పిల్లల ద్వారా ఆ కలని సాకారం చేసుకోవాలని భావిస్తారు. చాలా గొప్ప సినిమా ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు.  ‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. దీంతో నా కల నెరవేరింది’ అన్నాడు కె.కె.మీనన్. బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ తెలియని వారికి కూడా దానిపై ఆసక్తి కలిగించేలా ఈ సినిమా ఉంటుంది అని  సుధాంశు శర్మ చెప్పారు.