వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం ; మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్

వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం ; మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్
  • రాష్ట్రంలో మరో 15 ఏండ్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దే అధికారం: మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్
  •      వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకుంటం
  •      రాష్ట్రంలో ఏ పార్టీ మాకు పోటీ కాదు..
  •      ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు డీసీసీ పదవులిచ్చాం
  •      కష్టపడే కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని భరోసా

ఆసిఫాబాద్/కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్​ వ్యాఖ్యానించారు. మరో 15 ఏండ్లు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లో డీసీసీ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 కు పైగా సీట్లు గెలుచుకుంటామని, రాష్ట్రంలో తమకు ఏ పార్టీ పోటీ కాదని అన్నారు.

పదేండ్లు బీఆర్ఎస్​ పాలనలో అంతా దోపిడీనే జరిగిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బుల వాటాల పంచాయతీ కారణంగానే ఆ ఇంటిబిడ్డ కవిత బయటకు వెళ్లిపోయిందన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు 6,500 కోట్లు, ఉద్యోగుల జీతాలకు మరో 6,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు డీసీసీ పదవులు ఇచ్చామని, కష్టపడే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటామని చెప్పారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్ పోర్ట్ మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి.. రైతులకు సాగునీరు అందిస్తామని, ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామికంగా నంబర్ వన్ స్థానంలో నిలబెడతామని తెలిపారు. 

శ్రీరాముడు బీజేపీ జాగీరా?

కులమతాలను రెచ్చగొట్టే బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని  మహేశ్​కుమార్​ గౌడ్ ​అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్రీరాముడేమైనా బీజేపీ జాగీరా? వాళ్ల పార్టీలో సభ్యత్వం ఉందా’’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తున్నదని, రేషన్‌‌‌‌‌‌‌‌లో తమ వాటా ఉందని చెప్పుకునే బీజేపీ లీడర్లు.. దేశవ్యాప్తంగా సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడంలేదో చెప్పాలని నిలదీశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కారు మూసివేస్తున్నదని మండిపడ్డారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలో కరీంనగర్, నిజామాబాద్​ ఉమ్మడి జిల్లాలో లక్షల  టన్నుల బియ్యం స్మగ్లింగ్​ జరిగిందని తెలిపారు.  తెలంగాణ కోసం ఉద్యమించిన గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విషపూరిత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఈ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించారని గుర్తుచేశారు. 

జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి 14 సార్లు అవకాశమిచ్చాం..

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చిందని, మంత్రి పదవి ఇచ్చి సముచిత గౌరవం కల్పించిందని మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్​గౌడ్​ అన్నారు. ఆయనకు పార్టీ ఇంకా ఏం చేయాలని ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేతగా ఆయనకు సముచిత గౌరవం ఇచ్చామని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుతోపాటు తాను, ఇతర మంత్రులు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన రాజీనామా చేశారని చెప్పారు. స్థానికంగా ఉన్న విభేదాలతో ఆయన పార్టీ వీడుతున్నట్టు చెప్పడం సరికాదని, దీన్ని పరిష్కరించేందుకు పార్టీ తరఫున కృషి చేశామని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షమే లేదని, ఈ సమయంలో ఆయన ఏ పార్టీలోకి పోతారని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ , ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ , మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.