ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి : మహేష్ జెఠ్మలానీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును  సీబీఐతో దర్యాప్తు చేయించాలి : మహేష్ జెఠ్మలానీ

హైదరాబాద్ :  ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో విచారించాలని దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. బీజేపీ నేత బీఎల్ సంతోష్ తరపున ప్రముఖ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని చెప్పారు. ఈ కేసును సీబీఐతో కానీ స్వతంత్ర  సంస్థతో దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు. ఈ కేసులో సీఎం కేసీఆర్ ఇన్వాల్ మెంట్ పై తాను మాట్లాడడం లేదని, పోలీసులు చేసిన తప్పుల పై మాత్రమే స్పందిస్తానని మహేష్ జెఠ్మలానీ అన్నారు.