
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని, వచ్చేది కాంగ్రెస్ సర్కారేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆరోపించా రు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మళ్లీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.