తొందరపాటు నిర్ణయం: హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై మహేశ్‌ సచ్‌దేవ్‌ విమర్శ

తొందరపాటు నిర్ణయం: హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై మహేశ్‌ సచ్‌దేవ్‌ విమర్శ

వాషింగ్టన్: హెచ్‌1బీ వీసా ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడాన్ని మాజీ దౌత్యవేత్త మహేశ్‌ సచ్‌దేవ్​ తప్పు బట్టారు. ఇది తొందరపాటు నిర్ణయమని విమర్శించారు. అమెరికా డెసిషన్‌ తర్వాత ఇక్కడి లోకల్‌ మేనేజ్‌మెంట్ల నుంచే వ్యతిరేకత వ్యక్తంకావడంతో ఈ ఫీజు కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ, ఈ నిర్ణయం వల్ల ఇండియా నుంచి రావాలనుకునే ఐటీ నిపుణులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. 24 గంటల డెడ్‌లైన్‌తో ఉన్నట్టుండి సమస్యను పుట్టించి.. ఇప్పుడు బయటకు తీసిన టూత్‌పేస్ట్‌ను తిరిగి ట్యూబ్‌లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని సచ్‌దేవ్‌ కామెంట్‌ చేశారు.