రాజమౌళి సినిమాకి నో రెమ్యునరేషన్.. మహేష్ షాకింగ్ డెసిషన్

రాజమౌళి సినిమాకి నో రెమ్యునరేషన్.. మహేష్ షాకింగ్ డెసిషన్

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అంది మహేష్(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) మూవీ కోసమే. ఇక షూటింగ్ మొదలుకాకుండానే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

ఇక తాజాగా ఈ ప్రాజెక్టు కోసం మహేష్ బాబు తీసుకోనున్న రెమ్యునరేషన్ గురించి చర్చ నడుస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదట. నిజానికి ఈ ప్రాజెక్టు కు సంబందించిన ఫైనాన్సియల్ డీటెయిల్స్ అన్ని రాజమౌళినే దగ్గరుండి చూసుకుంటున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా కోసం మహేష్ కు రెమ్యునరేషన్ కాకుండా పార్టనర్ ని చేసే ఆలోయచనలో ఉన్నాడట రాజమౌళి. ఈ రకంగా చూసుకున్నా కూడా మహేష్ కు ఈ సినిమా ద్వారా డబ్బులు గట్టిగానే వచ్చే అవకాశం ఉంది.

యావరేజ్ టాక్ వచ్చిన ఈ సినిమా ఈజీగా రూ.2000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం. కాబట్టి రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగానే ఈ సినిమా కోసం,అందుకోనున్నారు మహేష్ బాబు. అలా ఇండియా నుండి భారీ రెమ్యునరేషన్ లేదా పర్సన్టేజ్ అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే అధికారికంగా మొదలుకానుండి. 2025 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.