కాంగ్రెస్తోనే రాజకీయ భవిష్యత్తు

కాంగ్రెస్తోనే రాజకీయ భవిష్యత్తు

కాంగ్రెస్కు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాజీనామా వార్తల్ని నిన్ననే ఖండించానన్న ఆయన..  చావైనా రేవైనా కాంగ్రెస్తోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఆ పార్టీతోనే తనకు భవిష్యత్తు ఉందని, ఏ సమస్య ఉన్నా పీఏసీ మీటింగ్ లో చర్చిస్తానని అన్నారు. ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాలు చేసినట్లు మహేశ్వర్ రెడ్డి చెప్పారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిర్మల్ కు తీసుకు వచ్చినప్పుడు తానొక్కడినే పనిచేశానని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ కార్యక్రమాలెన్నింటినో విజయవంతంగా చేశానని చెప్పారు. ఆగస్టు 15న నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి రిపోర్టు పంపడంలో ఆలస్యమైందని దాన్ని పంపమని స్టాఫ్ తో చెప్పానని క్లారిటీ ఇచ్చారు. నాలుగ్గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన అంశాలు బయటకు వచ్చినప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతుందని మహేశ్వర రెడ్డి వాపోయారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి  175 మంది లీడర్ల లిస్టు తయారైందని ప్రకటించారు.