
హైదరాబాద్, వెలుగు: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబురా లు నిర్వహించనున్నట్లు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఆవిష్కరించా రు.
ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మోర్చా నేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై దీనిని సక్సెస్ చేయాలని కోరారు.