మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి 56 లక్షల ట్యాక్స్ పెనాల్టీ

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి 56 లక్షల ట్యాక్స్ పెనాల్టీ

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ద్విచక్ర వాహన వ్యాపారానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకల కారణంగా రూ. 56 లక్షల ట్యాక్స్ పెనాల్టీ పడంది.  ప్రీ జీఎస్టీలో ఇన్ పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ క్రెడిట్ ను తప్పుగా ఫార్వాడ్ చేసినందుకు ఈ జరిమానా విధించారు. 

CGST చట్టం 2017సెక్షన్ 74 ప్రకారం..మహీంద్రా అండ్ మహీంద్రా ద్విచక్ర వాహనాల కంపెనీకి రూ. 56 లక్షల 04వేల 246 ల జరిమానా విధించించారు  CGST  అండ్ సెంట్రల్ ఎక్సైజ్ , అహ్మదాబాద్ సౌత్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్. ప్రీ జీఎస్టీ మెయింటెనెన్స్ అందుబాటులో ఉన్న ఇన్ పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ క్రెడిట్ క్లోజింగ్ బ్యాలెన్స్ తప్పుగా జీఎస్టీ  మెయింటెనెన్స్ లోకి ఫార్వార్డ్ చేయబదిందనే  ఈ జరిమానా విధించారు. 

అయితే కంపెనీ అప్పీల్ దాఖలు చేసేందుకు సిద్దమైంది.ఆశాజనకంగా ఫలితం వస్తుందని ఆశిస్తోంది. ఈ జరిమానా కంపెనీపై ఎలాంటి  ఆర్థిక ప్రభావం చూపదని భావిస్తోంది.