న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం డిజిటల్ కీలను అభివృద్ధి చేయడానికి శామ్సంగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫీచర్ శామ్సంగ్ వాలెట్‌కు లింకై ఉంటుంది. దీనివల్ల ఇకపై వాహనాలను అన్‌లాక్ చేయడానికి తాళంచెవి అవసరం లేదు. మహీంద్రా ఈ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ వాహన సంస్థ. ఈ సదుపాయం గెలాక్సీ జెడ్, ఎస్ సిరీస్ డివైజ్‌లలో శామ్సంగ్ వాలెట్ వాడేవారికి లభిస్తుంది.
తర్వాత ఏ సిరీస్‌లో కూడా అందుబాటులోకి రానుంది. కొత్త మహీంద్రా ఈఎస్‌యూవీలు నవంబర్ నుంచి ఈ ఫీచర్‌తో అమ్మకానికి వస్తాయి. ప్రస్తుతం ఉన్న కారు యజమానులు సర్వీస్ సెంటర్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయించుకోవాలి. ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయినా కూడా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) సొల్యూషన్ సహాయంతో డిజిటల్ కీ పనిచేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కారును లాక్ అన్‌లాక్ చేయవచ్చు.
