మహీంద్రా బొలెరో, థార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గాయ్..టయోట, టాటా, రెనాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు కూడా

మహీంద్రా బొలెరో, థార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గాయ్..టయోట, టాటా, రెనాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు కూడా
  • రూ.1.56 లక్షల వరకు కోతకి 
  • ధరలు తగ్గింపు వెంటనే అమల్లో

న్యూఢిల్లీ:  కేంద్రం చిన్న కార్లపై  జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీని తగ్గించడంతో  మహీంద్రా అండ్ మహీంద్రా  తమ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీల ధరలకు రూ.1.56 లక్షల వరకు కోత పెట్టింది. ఇది  స్కార్పియో, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ700, థార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బొలెరో  వంటి మోడళ్లకు వర్తిస్తుంది. కొత్త జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ  రేట్లు ఈ నెల  22  నుంచి అమలులోకి రానున్నప్పటికీ, మహీంద్రా మాత్రం ధరల తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. 

ధరలు తగ్గించిన టయోట, టాటా, రెనాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టయోట కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్ కూడా తన బండ్లపై ధరను రూ.3.49 లక్షల  వరకు తగ్గించనుంది.  గ్లాంజా ధర రూ.85,300, ఫార్చునర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.3.49 లక్షలు, లెజెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర  రూ.3.34 లక్షలు, హైలక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.2.52 లక్షలు తగ్గనున్నాయి. టాటా మోటార్స్ కూడా తన మోడళ్లపై  రూ.65 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ధరలు తగ్గించనుంది. టియాగో ధర రూ.75 వేలు, నెక్సాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.1.55 లక్షలు, హ్యారియర్ ధర  రూ.1.4 లక్షలు తగ్గనున్నాయి. 

రెనాల్డ్ ఇండియా క్విడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరను రూ.55,095, కైగర్ ధరను రూ. 96,395 తగ్గించనుంది. జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ  కౌన్సిల్ ప్రకారం, 1200సీసీ లోపున్న  పెట్రోల్/సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ/ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ  కార్లు, 1500సీసీ లోపున్న డీజిల్ కార్లు 28 శాతం నుంచి 18శాతం స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తాయి. పెద్ద కార్లు 40శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీకి మారాయి.