మాట తీరుతో సోషల్ మీడియాలో కుర్చీ తాతగా ఫేమస్ అయిన మహ్మద్ పాషా చనిపోయాడు. హైదరాబాద్ కృష్ణ కాంత్ పార్క్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవించే పాషా.. రోజూలానే కృష్ణ కాంత్ పార్క్ దగ్గరకు వెళ్లాడు. అయితే.. ఆ పార్క్ దగ్గర నడుస్తున్న సమయంలో కుర్చీ తాతకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అతనిని గుర్తించి CPR చేసే లోపే ప్రాణం పోయింది. ఒక్కసారిగా కుప్పకూలి నిమిషాల వ్యవధిలోనే కుర్చీ తాత ప్రాణాలు కోల్పోవడంతో ఆయనతో పరిచయం ఉన్న వాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆయన కుటుంబ సభ్యులకు కృష్ణ కాంత్ పార్క్ సిబ్బంది సమాచారం అందించారు. కుర్చీ తాత చెప్పిన ఒక మోనోలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ మోనోలాగ్లోని ‘‘ఆ కుర్చీని మడతబెట్టి’’ అనే మాటను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా వాడుకున్నారు. గుంటూరు కారం సినిమాలో ‘‘ఆ కుర్చీని మడతబెట్టి’’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో కుర్చీ తాతకు గుంటూరు కారం సినిమా యూనిట్ కొంత డబ్బు కూడా ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
►ALSO READ | ఎంత స్పీడ్తో కొట్టేసిందో.. ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఆ తర్వాత.. కుర్చీ తాత లైఫ్ మళ్లీ ఎప్పటిలానే మారిపోయింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కొంత డబ్బులు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత కుర్చీ తాత కూడా యూట్యూబ్ ఛానల్స్కు ఔట్ డేటెడ్ కంటెంట్ అయిపోవడంతో అవి కూడా ఆయన వైపు చూడటం మానేశాయి. మళ్లీ భిక్షాటనే దిక్కైంది. అప్పటి నుంచి హైదరాబాద్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుర్చీ తాత ఇక లేడనే వార్త మీమర్స్ను కంటతడి పెట్టించింది.
