RTC ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారంటే..

RTC ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారంటే..

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో రాష్ట్రంలో బస్సులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వాటిని నడిపించేందుకు ప్రభుత్వం తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఐనా.. బస్సులు సమయానికి దొరక్క జనం ఇబ్బందిపడుతున్నారు. 36 రోజులకు ముందే తాము ప్రభుత్వానికి తమ డిమాండ్లు విన్నవించామని.. సమ్మెకు వెళ్తామని నోటీసు ఇచ్చామని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంతకీ.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు ఎందుకు వెళ్తున్నారు… వారు ఏం డిమాండ్ చేస్తున్నారో ఓసారి చూద్దాం.

ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవే..

  • RTC సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి.

  • డీజిల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి.

  • మోటర్ వెహికల్ టాక్స్ సహా అన్ని పన్నులు రద్దుచేయాలి.

  • RTCకి, ఉద్యోగులకు బకాయి సొమ్ము మొత్తం(దాదాపు రూ.2వేల కోట్లు) వెంటనే చెల్లించాలి. ఫ్యూచర్ లోనూ పెండింగ్ పెట్టకూడదు.

  • డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

  • RTC సంస్థలో ఖాళీలు వెంటనే భర్తీచేయాలి.

  • వేతన సవరణ వెంటనే మొదలుపెట్టాలి.

  • కిరాయి బస్సులను రద్దుచేసి.. ఔట్ డేటెడ్ సర్వీసుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి.

  • చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలి.

  • బ్యాటరీ బస్సులకు కేంద్రం ఇచ్చే రాయితీ బెనిఫిట్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దు. ఆర్టీసీకే ఇవ్వాలి.

  • ప్రైవేటు వాహనాల విషయంలో నిబంధనలు కఠినంగా అమలుచేయాలి.

  • HMRకు ఇస్తున్నట్టు.. వయబిలిటీ గ్యాప్ ఫండ్ ను ఆర్టీసీలోనూ అమలుచేయాలి.

  • తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి.