నీకు దమ్ముంటే హత్య చేయించు.. మైనంపల్లికి సాయిప్రసాద్ సవాల్

నీకు దమ్ముంటే హత్య చేయించు.. మైనంపల్లికి సాయిప్రసాద్ సవాల్

మేడ్చల్ మల్కాజిగిరిలో రాజకీయ వేడి పెరిగింది. మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతున్న ఒక ఆడియో రిలీజ్ అయ్యింది. అయితే ఆ ఆడియోలో తనను హత్య చేయిస్తానని మైనంపల్లి అన్నాడని బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ మండిపడ్డారు. నీకు దమ్ముంటే నన్ను హత్య చేయించాలని మైనంపల్లికి బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ సవాల్ విసిరారు. 

మైనంపల్లి హన్మంతరావు చిల్లర రౌడీ వేషాలు మానుకోవాలని సాయి ప్రసాద్ హెచ్చరించారు. తాను ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని నీ ఉడత బెదిరింపులకు భయపడనని తెలిపారు.  మైనంపల్లి హనుమంతరావు రోజుకో పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని.. బీజేపీలోకి రావడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

మైనంపల్లి లాంటి రౌడీషీటర్లని తమ పార్టీలో చేర్చుకోమని కావాలంటే.. మా పార్టీ ఆఫీసులో బాత్రూంలు కడిగే పోస్ట్ ఇప్పిస్తామని తెలిపారు. మైనంపల్లి లాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ చేర్చుకోవద్దని సాయి ప్రసాద్ అన్నారు. ఆగస్టు 27 ఆదివారం బీజేపీ అధ్వర్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ ప్రవాస్ క్యాంపెయిన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అశోక్ హాజరయ్యారు.