మక్క కంకి.. ఆ టేస్టే వేరు..

మక్క కంకి.. ఆ టేస్టే వేరు..

వానాకాలం..చల్లని వాతావరణం..  వర్షం పడితే వెదర్ మరింత కూల్​గా మారుతుంది. ఇలాంటి సమయంలో హాట్ హాట్​గా ఉండే ఫుడ్​ తినేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. కొద్దిరోజులుగా సిటీలో వాతావరణం చల్లగా ఉంటుండగా.. వేడి వేడి మక్క కంకులకు ఇష్టంగా తినేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. 

సిటీలోని చాలా ప్రాంతాల్లో మక్క కంకులు అమ్మే బండ్లు కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు తోపుడు బండ్లపై పెట్టి కాల్చడం, ఉడకబెట్టి కంకులను అమ్ముతున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిటీలో ముసురు ఉండటంతో.. మక్క కంకులు అమ్మే బండ్ల వద్ద జనాల 
రద్దీ కనిపించింది.   – వెలుగు, హైదరాబాద్