- కోకాపేట్ పసిఫికా హిల్‌క్రెస్ట్ లో ఫైర్ యాక్సిడెంట్
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు
గండిపేట, వెలుగు: కొకాపేట్ పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్‌లో ఉన్న 6వ అంతస్తు ఫ్లాట్బాత్రూమ్లోని గీజర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి. ఆ ఫ్లాట్‌లో ఉన్న కుటుంబం వెంటనే అప్రమత్తమై కిందకు వచ్చేసింది.అయితే, ఈ మంటలు ఏకంగా 18వ అంతస్తు వరకు వేగంగా వ్యాపించాయి. దీనివల్ల ఆయా అంతస్తుల్లోని ఫాల్ సీలింగ్ , ఎలక్ట్రికల్ వైరింగ్ కాలిపోయాయి.
దీంతో ఫ్లాట్లలో ఉంటున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ బిల్డింగ్అంతా వ్యాపించింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి, మాదాపూర్ ఫైర్‌ఫైటర్స్4 ఫైర్ ఇంజన్లతో పాటు, బ్రోంటో స్కైలిఫ్ట్ మెషీన్‌తో గంట 40 నిమిషాల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు సకాలంలో బయటకు రావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, ప్రాణనష్టం తప్పింది. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
