హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు హైడ్రామా

హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు హైడ్రామా
  • అప్పు తీర్చేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ వ్యక్తి హల్‌‌చల్
  • ఛాతి, చేతులపై కోసుకుని ఆత్మహత్యాయత్నం

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌లోని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్‌‌చల్ చేశాడు. తన అప్పులు తీర్చుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్‌‌ను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి, అనుమతి నిరాకరించడంతో బౌన్సర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా కత్తితో తన ఛాతి, చేతులపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన భట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ వ్యాపారి..బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లోని పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్న ఠాకూర్ నాయక్ వ్యాపారంలో భాగంగా తనకు అప్పులు అయ్యాయని, అవి తీర్చే దారి కనిపించడం లేదని..ఆర్థిక సహాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్‌‌ ఇంటి దగ్గరికి ఫ్లెక్సీ బ్యానర్‌‌తో వచ్చాడు.

అయితే, అక్కడున్న బౌన్సర్ రామ్‌‌శెట్టి రాజీవ్ కుమార్ ఆయనను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో సుచేతన్ ఠాకూర్ నాయక్ బౌన్సర్‌‌తో వాగ్వాదానికి దిగి ఒక దశలో దాడికి యత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఛాతి, చేతులపై కోసుకుని సూసైడ్​అటెంప్ట్​చేశాడు. గమనించిన రాజీవ్ కుమార్‌‌, ఇతర బౌన్సర్లు అతడిని పట్టుకుని కత్తిని గుంజుకున్నారు. ఘటనపై బౌన్సర్ రామ్‌‌శెట్టి రాజీవ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.