నవంబర్21న ఏఐఏడ‌‌బ్ల్యూయూ దేశవ్యాప్త ఆందోళనలు 

నవంబర్21న ఏఐఏడ‌‌బ్ల్యూయూ దేశవ్యాప్త ఆందోళనలు 

న్యూఢిల్లీ, వెలుగు: కార్మిక హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్‌‌ 1 నుంచి 3 వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పార్లమెంట్‌‌ మార్చ్‌‌కు మద్దతుగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ కార్మికులు ఆందోళనలు నిర్వహించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడ‌‌బ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌‌ పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఉపాధి హామీ పనుల వద్ద, వ్యవసాయ క్షేత్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి కార్మికుల డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్‌‌ కోడ్ల ద్వారా హరిస్తోందని విమర్శించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సమ్మె హక్కులపై దాడి చేస్తోందన్నారు. ఉపాధి పథకంలో 200 రోజుల పని, రోజుకు700 వేతనం కల్పించాలని డిమాండ్‌‌ చేశారు.