ఓయూలో ఎన్హెచ్ఆర్సీ మెంబర్..లేడీస్ హాస్టల్ ను తనిఖీ చేసిన విజయభారతి సాయన్

ఓయూలో ఎన్హెచ్ఆర్సీ మెంబర్..లేడీస్ హాస్టల్ ను తనిఖీ చేసిన విజయభారతి సాయన్

ఓయూ, వెలుగు : ఓయూ లేడీస్ హాస్టల్‌‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్​విజయ భారతి సాయన్ గురువారం తనిఖీలు చేశారు. స్టూడెంట్స్​తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్​లో ఆహారం సరిగ్గా లేదని నిరసన తెలిపితే వార్డెన్ తో పాటు ఇతర అధికారులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె హాస్టల్​ డైరెక్టర్‌‌ ప్రొఫెసర్ కళ్యాణితో మాట్లాడారు. 

విద్యార్థుల సమస్యలను వారంలో పరిష్కరిస్తామని ఆమె సమాధానం చెప్పారు. తర్వాత విజయ భారతి మాట్లాడుతూ లేడీస్ హాస్టల్ లో సమస్యల పరిష్కారానికి వీసీ, రిజిస్ట్రార్​కు లెటర్ రాస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు గతంలో హాస్టల్‌‌లో చోటుచేసుకున్న సంఘటనలు, అధికారుల తీరుపై వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థి నాయకులు అలివేలు, రాజు, గెల్లు శేఖర్, మోక్షిత్, వంశీ, విజయ్ సింగ్, వీరబాబు పాల్గొన్నారు.