ఢిల్లీలో కాల్పులు.. దావూద్ ఇబ్రహీం అనుచరుడు హతం

ఢిల్లీలో కాల్పులు..  దావూద్ ఇబ్రహీం అనుచరుడు హతం

ఢిల్లీలో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ హతమయ్యాడు. నవంబర్ 20 శుక్రవారం ఉదయం పోలీసులకు దుర్రానీ గ్యాంగుకు మధ్య జరిగిన కాల్పుల్లో నసీమ్ దుర్రానీ చనిపోయాడు. నవంబర్ 16న ఈశాన్య ఢిల్లీలోని ఖజురీ ఖాస్ ప్రాంతంలో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కార్యాలయం సమీపంలో నసీమ్ దుర్రానీ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో సమీర్ అనే యువకుడిపై 20 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 

దావూద్ ఇబ్రహీం  డి-కంపెనీ (D-Company), అతని ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్‌తో దుర్రానీకి నేరుగా సంబంధాలు ఉన్నాయి. 2016లో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను హత్య చేసేందుకు ఛోటా షకీల్ ఇతనికి సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్ట్ తారిక్ ఫతా హత్యకు కుట్ర పన్నిన కేసుతో పాటు దుర్రానీపై హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి 25కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.