ఫైలేరియా, ఎయిడ్స్,డయాలసిస్ పేషెంట్లకు చేయూత..కొత్తగా మరో11,275 మందికి పింఛన్ మంజూరు 

ఫైలేరియా, ఎయిడ్స్,డయాలసిస్ పేషెంట్లకు చేయూత..కొత్తగా మరో11,275 మందికి పింఛన్ మంజూరు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు కొత్తగా 11,275 చేయూత పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. తాజాగా మంజూరైన వాటిలో 5,895 ఫైలేరియా బాధితులు.. 3,024 ఎయిడ్స్ బాధితులు, 2,356 డయాలసిస్ రోగులున్నారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది.

ఇప్పటికే వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు తదితర వర్గాలకు ప్రభుత్వం 4,63,857 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో కలిపి కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల సంఖ్య మొత్తం 4,75,132కు చేరింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.