కుభీర్, వెలుగు : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని అన్నపూర్ణ ఎలక్ట్రానిక్స్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రతి రోజు మాదిరిగానే యాజమాని రాత్రి దుకాణం మూసి వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. షాపులోని టీవీలు, రిఫ్రిజి రేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిబూడిదయ్యాయి.
చుట్టు పక్కల వారు గమనించి భైంసా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ. 20లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాని తెలిపారు. భారీ మంటలు ఎగిసిపడడంతో చుట్టు పక్కల ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.