రంగారెడ్డి జిల్లా నందిగామలో పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల నష్టం..!

రంగారెడ్డి జిల్లా నందిగామలో పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల నష్టం..!

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (మార్చి 28) ఉదయం శ్రీకృష్ణ పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సహయంతో భారీగా ఎగసిపడుతోన్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

 గోదాంలో పత్తి పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇక్కడ గోదాంను అద్దెకు తీసుకొని పత్తి నిల్వ ఉంచినట్లు సమాచారం. గోదాంలో ఉన్న పత్తి విలువ దాదాపు 60 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.