అడివి శేష్‌కు రామ్ నాథ్ ప్రత్యేక ఆహ్వానం.. మేజర్ మూవీపై ప్రశంసలు

అడివి శేష్‌కు రామ్ నాథ్ ప్రత్యేక ఆహ్వానం.. మేజర్ మూవీపై ప్రశంసలు

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించాడు. 2022లో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అంతేకాకుండా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ ఆఫీసర్స్, పొలిటీషియన్స్, సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే.. తాజాగా ఈ లిస్టులో భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా చేరాడు. ఆయన స్వయంగా హీరో అడివి శేష్ కు ఆహ్వానం పంపించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ ను రూపొందించినందుకు అడివి శేష్‌ ని అభినందించారు రామ్ నాథ్ కోవింద్. సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు అడివి శేష్ ను అభినందించి, ఆశీర్వదించారు.

ఇక ‘మేజర్’ చిత్రాన్నీ శశి కిరణ్ తిక్క తెరకెక్కించగా.. జీయంబీ ఎంటర్‌ టైన్‌ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.