ట్రాక్ట‌ర్ ను ఢీకొన్న బొకారో ఎక్స్ ప్రెస్.. జార్ఖండ్ లో రైలు ప్ర‌మాదం

ట్రాక్ట‌ర్ ను ఢీకొన్న బొకారో ఎక్స్ ప్రెస్.. జార్ఖండ్ లో రైలు ప్ర‌మాదం

న్యూఢిల్లీ -భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది.  న్యూఢిల్లీ నుంచి  భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్  జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ట్రాక్టర్ ను డీకొట్టబొయింది. అయితే లోకో పైలెట్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

అసలు ఏం జరిగింది..

న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వస్తున్న సమయంలో జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోని భోజుదిహ్‌ స్టేషన్‌ సంతాల్దిహ్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద రైల్వే గేటును వేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ట్రాక్టర్‌ రైలు గేటును బలంగా ఢీ కొట్టింది. అనంతరం రైలు గేటు, పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో రైలు ఆగింది. 

ఈ ఘటనలో ట్రాక్టర్‌ను సీజ్ చేసిన పోలీసులు..కేసు నమోదు చేశారు. అటు  గేట్ మ్యాన్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే  ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.