దర్శనమిచ్చిన మకరజ్యోతి.. మార్మోగిన శబరిగిరులు

దర్శనమిచ్చిన మకరజ్యోతి.. మార్మోగిన శబరిగిరులు

శబరిమలలో మకరజ్యోతిని దర్శించుకుని పులకించిపోయారు అయ్యప్ప భక్తులు. మకరజ్యోతి దర్శనంతో శబరిగిరులు.. స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో మార్మోగిపోయాయి. తమ ఆరాధ్య దైవాన్ని కనులారా దర్శించుకోవడంతో భక్తులు ఆనందంలో మునిగిపోయారు.

కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. మొత్తం మూడుసార్లు మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సమయంలో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. అయ్యప్పస్వామి ఆభరణాలను ఆలయానికి తీసుకొచ్చే ఘట్టం వైభంగా నిర్వహించారు ఆలయ అధికారులు. స్వామివారి ఆభరణాలను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. 

జ్యోతి దర్శనానికి 50వేల మంది భక్తులకు ట్రావెన్ కోర్ బోర్డు అనుమతిచ్చింది. కానీ సుమారు 4లక్షల మందికి పైగా భక్తులు ప్రత్యక్షంగా మకరజ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ప్రత్యేక వ్యూ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.