కల్లూరు, వెలుగు : గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కీసర మధుసూదన్ రెడ్డిని ప్రజలంతా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కోరారు ఈ నెల 17న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పార్టీ శ్రేణులతో కలిసి పేరువంచలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు, ఫ్రీ కరెంట్, సన్న బియ్యం పంపిణీ, ధాన్యానికి మద్దతు ధర, బోనస్ లాంటి వాటిని వివరించారు.
అంతుకుముందు గ్రామ ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కీసర మధుసూదన్ రెడ్డి, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయుకులు పసుమర్తి చంద్రరావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఏనుగు సత్యంబాబు, కీసర శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
