ఉపాధి హామీ వర్కర్లకు ఇన్సూరెన్స్​ కంపల్సరీ చేయండి

ఉపాధి హామీ వర్కర్లకు ఇన్సూరెన్స్​ కంపల్సరీ చేయండి
  • స్టేట్​ బ్యాంకు రిపోర్టు

ముంబై: దేశంలో ఇన్సూరెన్స్​ మరింత పెరగాలంటే ఉపాధి హామీ పథకం వర్కర్లకు ఇన్సూరెన్స్​ను కంపల్సరీ చేయాలని స్టేట్​ బ్యాంకు ఒక రిపోర్టులో వెల్లడించింది. ఇన్సూరెన్స్​ పాలసీలపై జీఎస్​టీని 18 శాతం నుంచి తగ్గించాలని కూడా సూచించింది. ఇందువల్ల దేశంలోని మరింత ప్రజలు ఇన్సూరెన్స్​ సదుపాయం పొందడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. ఉపాధి హామీ వర్కర్లకు రూ. 342 ఖర్చుతోనే ఇన్సూరెన్స్​ కల్పించొచ్చని చెబుతూ, ఇందుకయ్యే రూ. 400–500 కోట్లను ప్రభుత్వమే భరించొచ్చని సూచించింది. వంద రోజుల పని పూర్తి చేసే హౌస్​ హోల్డ్స్​ సంఖ్య 10 శాతానికి మించదని, కాబట్టి ఈ ఖర్చును ప్రభుత్వమే పెట్టొచ్చని పేర్కొంది. 2015 ఫైనాన్షియల్​ ఇయర్​ నుంచి ఇన్సూరెన్స్​ వ్యాప్తి మళ్లీ పెరిగిందని, ఇది 2021 నాటికి 4.2 శాతమని  వెల్లడించింది.