సరిపోదా శనివారం సినిమా నుంచి .. రెండో పాటకు ముహూర్తం ఫిక్స్

సరిపోదా శనివారం సినిమా నుంచి .. రెండో పాటకు ముహూర్తం ఫిక్స్

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి  నిర్మిస్తున్నారు.  ఇందులో  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. టీజర్‌‌‌‌‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రతి శనివారం ఒక అప్‌‌‌‌డేట్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న టీమ్.. ఈ శనివారం  ‘ఉల్లాసం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో నాని, ప్రియాంక మోహన్ లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.  ఇందులో నాని, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌లో కనిపించనున్నాడు. ఒక పాత్రలో రగ్డ్ లుక్‌‌‌‌లో నటించగా, మరో పాత్రలో సాఫ్ట్‌‌‌‌గా కనిపిస్తాడు. ప్రియాంక మోహన్ పోలీస్ కానిస్టేబుల్‌‌‌‌ పాత్ర పోషిస్తోంది.  ఎస్‌‌‌‌జే సూర్య, సాయి కుమార్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా విడుదల కానుంది.