రాజ్ తరుణ్ .. తిరగబడరసామీ రిలీజ్ డేట్ ఫిక్స్

రాజ్ తరుణ్ ..  తిరగబడరసామీ రిలీజ్ డేట్ ఫిక్స్

రాజ్ తరుణ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. మాల్వీ మల్హోత్రా హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఆగస్టు 2న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో మన్నారా చోప్రా  డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు స్పెషల్ సాంగ్‌‌‌‌లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌‌‌‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర  ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులోని యాక్షన్‌‌‌‌తో పాటు ఎమోషన్ , ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ చెప్పారు.